మీసేవ నిర్వాహకుల హక్కులపై రాజీలేని పోరాటం

12-09-2026 | 11:10pm

- మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైర శంకర్

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): మీసేవ నిర్వాహకుల హక్కుల(rights of Meeseva administrators) పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాజీలేని పోరాటాలు చేస్తోందని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైర శంకర్ స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట(Siddipet)లో నిర్వహించిన తెలంగాణ మీసేవ ఫెడరేషన్(Telangana Meeseva Federation) జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మీసేవ నిర్వాహకులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఫెడరేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు.  మీసేవ కేంద్రాలలో పహాణీలతోపాటు ఇతర భూ రికార్డుల సేవలను ప్రభుత్వం తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. సిటిజన్ ఛార్టర్‌లో పేర్కొన్న రుసుములను మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏరోళ్ల బాలరాజు, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ మొహిద్, లీగల్ అడ్వైజర్ రాయల ఉదయ్ కుమార్, కల్చరల్ సెక్రటరీ బురుగు ముకేష్, జిల్లా అధ్యక్షుడు చుక్క భరత్, ప్రధాన కార్యదర్శి నగేష్ పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా చుక్క భరత్ కుమార్, ఉపాధ్యక్షులుగా కొత్త సంపత్ కుమార్, ఎలుక నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా అనంతారం నగేష్, సహాయ కార్యదర్శులుగా కండ్లకోయ పరుశరాములు, గాదగోని రమేష్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా సుంకర శ్రీనివాస్, కోశాధికారిగా ఉప్పరి మహేష్, సహాయ కోశాధికారులుగా లెంకల రఘు, ఎండి ఇస్తాక్, కల్చరల్ సెక్రటరీగా తీగల చంద్రశేఖర్,  కార్యవర్గ సభ్యులుగా జయప్రకాశ్ రెడ్డి, నారదాసు పోశెట్టి, చొప్పదండి సాయి కృష్ణ, కాపర్తి పవన్, గర్రెపల్లి వెంకటేశం, మహిళా వీఎల్ఈ కోఆర్డినేటర్ గా కాంతారెడ్డి మంజుల, మానాల తిరుమల, మీడియా ఇన్ఛార్జిగా వడ్డేపల్లి ప్రకాష్, స్పోక్ పర్సన్ గా రమేష్ చంద్ర, సలహాదారుగా కరుణాకర్ లీగల్ అడ్వైజర్ గా కస్తూరి భూంరెడ్డి ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు