రైతునేస్తం కార్యక్రమంలో ఆరుతడి పంటలపై అవగాహన

27-10-2026 | 06:01pm

బిక్కనూర్, అక్టోబర్‌ 27 (విజయ క్రాంతి): రైతులు ఆరుతడి పంటల(Farmers are harvesting crops) సాగుపై అవగాహన పెంచుకొని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మంగళవారం బిక్కనూర్‌ మండలం పెద్దమల్లారెడ్డి రైతు వేదికలో రైతునేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరుతడి పంటల సాగు విధానాలు, వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బాలగౌని రాజాగౌడ్‌, సీఈవో మోహన్‌గౌడ్‌, రైతులు, డ్వాక్రా మహిళలు, సొసైటీ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు