రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు సింధు విద్యార్థిని సోఫియాన్ ఎంపిక
బాన్సువాడ,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో నిర్వహించనున్న 70వ వార్షిక రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ (SGF) క్రీడా పోటీల్లో అండర్-14 వాలీబాల్ విభాగం(Under-14 Volleyball Section)లో పాల్గొనేందుకు కామారెడ్డిలో గురువారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన సింధు విద్యాలయం విద్యార్థి సోఫియాన్ ఎంపికయ్యాడు.
ఉమ్మడి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం జ్ఞానేశ్వర్, అనిల్, ప్రిన్సిపల్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. 8వ తరగతి చదువుతున్న సోఫియాన్ సాధించిన ఈ విజయంపై సింధు విద్యాలయం మేనేజ్మెంట్, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలిపారూ.భవిష్యత్తులోనూ మరిన్ని క్రీడా విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.