రైతుల సంక్షేమమే లక్ష్యం

12-11-2026 | 08:11pm

అడ్డాకుల, నవంబర్ 13 (విజయక్రాంతి): అడ్డాకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Addakula Primary Agricultural Cooperative Society) (PACS) నూతన చైర్మన్‌గా గంగుల విజయమోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) దంపతులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ విజయమోహన్ రెడ్డితో పాటు పాలకవర్గ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన పాలకవర్గం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. కరువు పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

అలాగే ఉపాధి హామీ పథకం కింద అదనంగా 50 రోజుల పనిదినాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, రైతుల సౌకర్యార్థం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక మార్కెట్ యార్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సన్నబియ్యం పంపిణీని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయబోమని స్పష్టం చేశారు. అనంతరం 14 మహిళా సంఘాలకు రూ.1.80 ఒక కోటి 80 లక్షలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, PACS నూతన పాలకవర్గ సభ్యులు, అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు