మార్కెట్లలో మళ్లీ జోష్

12-11-2026 | 10:23am

82 వేల మార్క్ దాటిన సెన్సెక్స్! నిఫ్టీ కూడా పరుగులు!

ముంబై: దేశీయ Stock Marketలో గురువారం (నవంబర్ 12) ఉదయం కొనుగోళ్ల సందడి నెలకొంది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం (Foreign Fund Inflows) కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో Crude Oil Prices తగ్గడం దేశీయ సూచీలకు ఊతమిచ్చాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే Sensex 166.44 పాయింట్లు పెరిగి 82,013.58 స్థాయికి చేరింది. మరోవైపు Nifty కూడా 55.65 పాయింట్లు లాభపడి 25,316.55 వద్ద ట్రేడయింది. దీంతో ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశలు చిగురించాయి. 

మార్కెట్ల ర్యాలీలో పలు ప్రముఖ కంపెనీల షేర్లు కీలక పాత్ర పోషించాయి. Sensexలో Bajaj Finance, Bajaj Finserv, ITC, Eternal, State Bank of India (SBI), ICICI Bank షేర్లు ప్రధానంగా లాభాల్లో నిలిచాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు, చమురు ధరల తగ్గుదల మార్కెట్ Sentiment‌ను బలపరిచాయి. ఈ జోరు కొనసాగితే సూచీలు మరింత పైకి వెళ్లే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరలు, పెట్టుబడుల ప్రవాహాన్ని ట్రేడర్లు నిశితంగా గమనిస్తున్నారు.

మరిన్ని వార్తలు