జనసేన పేరుతో భారీ స్కామ్

12-11-2026 | 11:42am

ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్ల టోకరా.. జనసేన పేరు అడ్డంగా!

మంగళగిరి: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని భారీ Job Scam కు తెరలేపిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం పేరు, పార్టీ గుర్తులు, సీనియర్ నేతల పేర్లను ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు 20 మంది నుంచి ఏకంగా రూ.7 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను Government Jobs పేరుతో నమ్మించిన నిందితుడు.. పార్టీ కార్యాలయంతో సంబంధాలు ఉన్నాయంటూ వారిని మభ్యపెట్టినట్లు సమాచారం. ఉద్యోగాలు ఇప్పిస్తానని Assurance ఇచ్చి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చేతికి అందిన తర్వాత నిందితుడు Contact లో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు తాము మోసపోయామని గుర్తించి ఆందోళనకు గురయ్యారు.

ఈ Fraud Case పై జనసేన నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, పార్టీ సీనియర్ నాయకుడు కళ్యాణం శివ శ్రీనివాసరావు, జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్ కోట రుక్మిణి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో Written Complaint అందజేశారు. పార్టీ పేరు, గుర్తులు, నేతల పేర్లను దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి Investigation ప్రారంభించారు. నిందితుడి వివరాలు, డబ్బుల లావాదేవీలు, బాధితుల సంఖ్యపై విచారణ కొనసాగుతోంది. ఉద్యోగాల పేరుతో జరిగే ఇలాంటి Job Frauds పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


మరిన్ని వార్తలు