నీటి గేట్ వాల్ పగిలి వృధాగా పోతున్న తాగునీరు
సమాచారం ఇచ్చిన స్పందించని అధికారులు
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల(Korremula)లో పోస్ట్ ఆఫీస్ సమీపంలో 10 రోజులుగా తాగునీటి సరఫరా గేట్ వాల్(Drinking water supply gate wall) పగిలి వృధాగా నీళ్లు పోతున్నాయని, రోడ్డుపై నీరు ప్రవహించడంతో స్థానిక నివాస ప్రజలు రోడ్డుపై నడవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నట్లు గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన లోక్ జనశక్తి పార్టీ(Lok Janshakti Party) రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పల నర్సింగ్ రావు తెలిపారు.
ఈ విషయమై అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించట్లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని చిప్పల నర్సింగ్ రావు డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావంతో ఒకపక్క నీటి ఎద్దడి రానుందని జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్న ఈ సంఘటనతో అధికారులు పట్టించుకోనట్లు కనిపిస్తుందన్నారు.