డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..!
ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం బతుకమ్మ పండగను మహిళా సాధికారత విభాగం, ఐక్యుఏసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఉదయాన్నే ముస్తాబై కళాశాలకు చేరుకుని రంగురంగుల పూలతో సాంప్రదాయంగా బతుకమ్మను పేర్చి విద్యార్థిని విద్యార్థులు కోలలు వేస్తూ ఆటపాటలతో బతుకమ్మ పండగను సంబరంగా జరుపుకున్నారు. అనంతరం ఐ క్యూ ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ శంకరయ్య బతుకమ్మ పండగ విశిష్టతని వివరించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ మొదటి ద్వితీయ తృతీయ బహుమతులను డిగ్రీ కళాశాల విద్యార్థినులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల మహిళా సాధికార విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎస్ గోదావరి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, మహిళా సాధికారత సభ్యులు నాగినిక, కళాశాల సూపర్డెంట్ వసంత లక్ష్మి, రాణి, స్వప్న, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రకాంత్, ఐ క్యూ ఏ సి సమన్వయకర్త డాక్టర్ వి శంకరయ్య, టి ఎస్ కే సి సమన్వయకర్త జె శివ కుమార్, అధ్యాపక బృందం అమరేశం ప్రభాకర్,డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దిరాజు, కృష్ణ ప్రసాద్, శశిధర్, సంతోష్, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతరులు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.