రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకనే విద్యుత్ కోతలు

17-10-2026 | 08:29pm

ఎలెనినో వల్ల సమస్య ఉంటుందని 6 నెలల ముందే తెలిసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు

గత ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారంపై పెట్టడం లేదు

ఈ పంట కి నీళ్ళు ఇవ్వాలి, యాసంగి పంటకి ప్రణాళిక తయారు చేయాలి

లేకపోతే త్రాగు నీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి,(విజయ క్రాంతి): రైతులకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనత పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనివారం విద్యుత్ శాఖ సూపరిండెంట్ కార్యాలయం వద్ద ఆందోళన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో  ధర్నా చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ సాల్య నాయక్ కి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేఎల్పీ ఉపనేత  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ముందు చూపు లేకనే రైతులు విద్యుత్ కోతలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు, ఎలెనినో వల్ల సమస్య ఉంటుందని 6 నెలల ముందే తెలిసినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదనీ అన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాళేశ్వరం పేరిట గత ప్రభుత్వాన్ని విమర్శించడం పై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారంపై పెట్టడం లేదనీ అన్నారు.

ఈ పంట కి నీళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలనీ డిమాండ్ చేశారు , యాసంగి పంటకి క్యాబ్ ప్రణాళిక ఇప్పుడే తయారు చేయాలనీ అధికారులను కోరారు. లేకపోతే త్రాగు నీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, భానుచందర్, రాజు  పాటిల్, కాసర్ల నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు