ఎమ్మెల్యే ఏలేటికి ఆహ్వానం
ఖానాపూర్ ( విజయక్రాంతి) : ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి(Sri Sri Sri Lakshmi Venkateswara Swamy) వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని(Alleti Maheshwar Reddy) ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యేను కలిసి ఉత్సవాల ఆహ్వానాన్ని ఆదివారం అందజేశారు.
ఈ నెల 22వ తేదీ గురువారం నుంచి 28వ తేదీ వరకు వారం రోజులపాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యేను కోరారు.