బీటీపీఎస్‌లో కార్మిక సంఘ నాయకుని దాతృత్వం
25 మంది మహిళా కాంట్రాక్టు కార్మికులకు ఉచితంగా చీరలు, జాకెట్ల పంపిణీ
మణుగూరు, అక్టోబర్ 18,(విజయక్రాంతి ): భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(Bhadradri Thermal Power Station) (బీటీపీఎస్)లో కార్మిక సంఘ నాయకుడు కొత్త జాన్‌రెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని బీటీపీఎస్‌లోని సివిల్ సర్కిల్-2లో ఆదివారం నిర్వహించిన దుర్గమ్మవారి పూజా కార్యక్రమంలో భాగంగా అక్కడ పనిచేస్తున్న 25 మంది మహిళా కాంట్రాక్టు కార్మికులకు(female contract workers) ఉచితంగా చీరలు, జాకెట్లను పంపిణీ చేశారు.కార్మిక సంఘం-1535 రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న కొత్త జాన్‌రెడ్డి మహిళా కార్మికులకు పండుగ కానుకలు అందించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సర్కిల్-1 ఎస్ఈ రాంప్రసాద్ దంపతులు పాల్గొని మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఈ రాంప్రసాద్ మాట్లాడుతూ, మహిళా కార్మికులకు పండుగ సందర్భంగా అండగా నిలిచి, తన దాతృత్వాన్ని చాటుకున్న జాన్‌రెడ్డిని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కార్మికుల్లో ఆత్మీయతను, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాసుతో పాటు పలువురు కర్మాగార ఉద్యోగులు పాల్గొన్నారు.