అమ్మవారి సేవలో వేముల మహేష్ గౌడ్
ఘట్ కేసర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : శ్రీ దేవి శరన్నవరాత్రులలో(Sri Devi Sharanavaratri) భాగంగా ఆదివారం పోచారం డివిజన్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ(Ismail Khan Guda) లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటీక్యాల కృష్ణరెడ్డి(Itikyala Krishna Reddy), గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గమాత అమ్మవారిని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్(Vemula Mahesh Goud) దర్శించు కుని ప్రత్యేక పూజ లు జరిపారు. అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, సహకార బ్యాంక్ డైరెక్టర్ ఇటిక్యాల రామకృష్ణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్, నాయకులు గొంగళ్ళ బాలేష్, అచ్చిని రమేష్, గొంగళ్ళ చంద్రకాంత్, ననావత్ సురేష్ నాయక్, ఈగ మధు ముదిరాజ్, కొడకండ్ల లింగం, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.