గౌరిశెట్టి వారి ఆధ్వర్యంలో బతుకమ్మ విగ్రహాల ఏర్పాటు
ఎమ్మెల్యే పాయం ఆవిష్కరణ
ఆళ్లపల్లి,అక్టోబర్ 18, (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీక అయిన బతుకమ్మ పండుగను(Bathukamma Festival) పురస్కరించుకుని ప్రముఖ వ్యాపారస్తులు కీర్తిశేషులు,గౌరి శెట్టి శేషయ్య వీరలక్ష్మి జ్ఞాపకార్థం కుమారులు గౌరిశట్టి నాగభూషణరావు, భారతమ్మ, నాగపాణి, లీలావతి జగన్మోహన్రావు, రమాదేవి సుదర్శన్ రావు సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాలను పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు(Payam Venkateswarlu) ఆదివారం ఆవిష్కరించారు.
తెలంగాణ స్ఫూర్తితో, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంస్కృతిని భావి తరాలకు తెలియజేసేందుకు, గౌరిశెట్టి శేషయ్య వీరలక్ష్మి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఈ విగ్రహాలను ఏర్పాటు చేశామని వారు తెలిపారు. గ్రామంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దమని, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని గౌరి శెట్టి కుటుంబాన్ని అభినందించారు. తెలంగాణ సంస్కృతిని కాపాడు కోవడం మన బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గౌరిశెట్టి శ్రీనివాసరావు, విజయ లలిత, శివాజీ రావు ,రాధ ,చంద్రశేఖరావు, శ్రీదేవి, సువర్ణ, వంశీ, దిలీప్, సారిక, సర్పంచ్ వాసం సుష్మిత, మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.