నాచారం రహదారికి రూ.44 కోట్లతో మహర్దశ
* నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ రఘురాం రెడ్డి
ఏన్కూరు, ఖమ్మం, అక్టోబర్ 18(విజయక్రాంతి): రూ. 44 కోట్లతో నిర్మించే నాచారం రహదారి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి(Ramasahayam Raghuram Reddy) ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అత్యంత క్లిష్టమైన ఆర్థిక శాఖను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమర్థవంతంగా నిర్వహిస్తూ తెలంగాణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు అందుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో..: కలెక్టర్ దివాకర.టిఎస్, సిపి సునీల్ దత్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.