నీటి కుంటలో పడి బాలుడు మృతి
18-10-2026 | 06:40pm
పండుగ పూట విషాదం
జనగామ, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : రఘునాథపల్లి మండలం(Raghunathapalli Mandal) బానాజీపేట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో(water pond) పడి బాలుడు మృతి చెందాడు. జనగామ పట్టణానికి చెందిన మహమ్మద్ షహర్ అనే బాలుడు పండుగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చి తాతతో కలిసి నీళ్లను చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో పండుగ పూట విషాదఛాయలు నెలకొన్నాయి. స్థానిక ఎస్ఐ భరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.