తెలంగాణ ఉద్యమ నాయకులకు ఘన సన్మానం
భిక్కనూర్, అక్టోబర్ 11 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన భిక్కనూర్ మండల బీఆర్‌ఎస్ ఉద్యమ నాయకులను ఘనంగా సన్మానించారు. అందె మహేందర్‌రెడ్డి, తక్కళ్ల నరేందర్‌రెడ్డి, వంగేటి నర్సారెడ్డి, ఏనుగు రాజిరెడ్డి, వల్లకొండ సురేందర్‌రెడ్డి, వడ్ల బ్రహ్మచారి, దేవరాజులను శాలువాలతో సత్కరించి వారి ఉద్యమ సేవలను గుర్తుచేసుకున్నారు.
జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, హనుమంత్ షిండే, ముజీబొద్దీన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్రను నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో భిక్కనూర్ మండల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.