తాడువాయిలో వైభవంగా యజ్ఞం
17-10-2026 | 08:27pm
తాడ్వాయి,అక్టోబర్,17( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం ఆద్య సేన యూత్ క్లబ్(Adya Sena Youth Club) ఆధ్వర్యంలో వైభవంగా యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా దుర్గామాత భక్తులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదం వితరణ చేశారు.నందివాడ గ్రామంలో శ్రీ శివ గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత భక్తులు,యువకులు పాల్గొన్నారు.