భిక్కనూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా అన్నదానం

16-09-2026 | 06:47pm

భిక్కనూర్,(విజయక్రాంతి): గణేష్‌ నవరాత్రి ఉత్సవాల(Ganesh Navratri Festival) సందర్భంగా భిక్కనూర్‌ పోలీస్‌స్టేషన్‌(Bhikkhunur Police Station)లో బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కామారెడ్డి డీఎస్పీ ఎస్‌. మధుసూదన్‌, భిక్కనూర్‌ సీఐ జె. నరేష్‌, మండలంలోని సర్పంచులు, గణేష్‌ ఉత్సవాల యువజన నిర్వాహకులు హాజరయ్యారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం(Food Distribution)లో పలువురు భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ ఎస్‌.అనిల్‌ మాట్లాడుతూ గణేష్‌ నిమజ్జన కార్యక్రమాల(Ganesh immersion programs) సందర్భంగా డీజే సౌండ్‌ వినియోగానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీస్‌ శాఖ సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులకు నిర్వాహకులు సహకరించాలని సూచించారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు