స్వీట్ షాపులు, బేకరీలపై ప్రత్యేక తనిఖీలు
బాన్సువాడ, అక్టోబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని పలు స్వీట్ షాపులు, బేకరీలలో(Sweet shops and bakeries) జిల్లా ఆహార నాణ్యత(District Food Quality) అధికారి జి. విక్రమ్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు(Inspections) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ స్వీట్లు, బేకరీ ఉత్పత్తులపై ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా పలు ఆహార వ్యాపార సంస్థలు(Food business enterprises) ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్,లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే పలు పరిశుభ్రత లోపాలు కూడా గుర్తించబడ్డాయి.
తనిఖీలలో అనుమానాస్పదంగా ఉన్న ఆహార నమూనాలను అక్కడికక్కడే సేకరించి విశ్లేషణ నిమిత్తం ల్యాబొరేటరీకి పంపడం జరిగిందనీ ఆయన తెలిపారు. పరిశుభ్రత పాటించని,లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేని ఆహార వ్యాపార నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు.ప్రజలు పరిశుభ్రత పాటించే దుకాణాల నుండి మాత్రమే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని, అలాగే కొనుగోలు చేసే ముందు లేబుల్స్ ను సరిగ్గా చదివి తెలుసుకోవాలని సూచించడమైనది.