లబ్ధిదారురాలుకు కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామం(Chandapur Village)లో సోమవారం లబ్ధిదారురాలు ముద్దు కలవ్వకు నాయకులు కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ(Kalyana Lakshmi Check Distributed) చేశారు. ఈ సందర్భంగా తాడ్వాయి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ మాట్లాడుతూ... ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే మదన్ మోహన్ రావు(MLA K. Madan Mohan Rao) ఎల్లారెడ్డిలో లబ్ధిదారులందరికీ చెక్కులు అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గడ్డం సాయి రెడ్డి, గ్రామ అధ్యక్షుడు ముద్దు మైపాల్,యూత్ అధ్యక్షులు నరేష్,సాకలి రాజయ్య,గద్దరాజు సందయ్య, ఆవుల బాలరాజ్,రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.