కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్

15-10-2026 | 08:01pm

నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి కల్యాణ లక్ష్మి చెక్కులను నాగిరెడ్డిపేట గ్రామ సర్పంచ్ మన్నె వెంకట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, నాయకులు పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం గ్రామ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులు సుభాషిని, చాకలి యశోద,మంగలి లక్ష్మీలకు పంపిణీ చేయడం జరిగింది.సీఎంఆర్ఎఫ్ చెక్కులు నత్తి ప్రభావతి 12000 రూపాయల చెక్కు, తలారి లక్ష్మణ్ ఠాగూర్ 26000 రూపాయల చెక్కును గ్రామ సర్పంచ్ మన్నె వెంకట్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ సురేందర్ గౌడ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నె వెంకట్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ సురేందర్ గౌడ్,గోపాల్పేట్ ఉపసర్పంచ్ గులాబ్ హుస్సేన్,గ్రామ అధ్యక్షుడు బోయిని హనుమాన్లు, సీనియర్ నాయకులు సాయ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు