రోడ్డు పక్కకు ఒరిగిన భారీ లారీ: తప్పిన పెను ప్రమాదం

10-10-2026 | 08:01pm

​లింగంపేట,(విజయక్రాంతి): కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న ఓ భారీ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన గల గుంతలోకి ఒరిగిన ఘటన లింగంపేట మండల పరిధిలోని బురుగిద్ద శివారులో చోటుచేసుకుంది. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి వైపు నుంచి ఎల్లారెడ్డి మార్గంలో వెళ్తుండగా బోరుగిద్ద శివారుకు చేరుకోగానే లారీ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న గుంతలోకి ఒరిగిపోయింది.

ఆ సమయంలో డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ​తోటి లారీ డ్రైవర్ల సహకారంతో గుంతలో దిగబడిన లారీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

మరిన్ని వార్తలు