గ్రామాల్లో మొదలైన బతుకమ్మ సంబరాలు
10-10-2026 | 09:07pm
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం(Bhikkanoor mandal)తో పాటు పరిసర గ్రామాల్లో బతుకమ్మ పండుగ సంబరాలు(Bathukamma Festival Celebrations) ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో మహిళలు నూతన వస్త్రాలు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా చిన్న,పెద్ద ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం గ్రామాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల సందడితో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.