జేఎన్టీయూలో సౌత్ జోన్ మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక
కూకట్ పల్లి,(విజయక్రాంతి): జేఎన్టీయూహెచ్ ఇండోర్ స్టేడియం(JNTUH Indoor Stadium)లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక ట్రయల్స్ ను శనివారం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలోని కేఎల్ఈ టెక్నాలజీ యూనివర్సిటీ(KLE Technological University)లో ఈనెల 18 నుండి 21వ తేది వరకు జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనేందుకు ఈ ఎంపికలు చేపట్టారు.
ఎంపికైన క్రీడాకారులు జేఎన్టీయూహెచ్ తరఫున పోటీలలో ప్రాతినిధ్యం వహించనున్నట్లు స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి ప్రొ. ఎన్. ఎస్. దిలీప్ తెలిపారు. విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఇలాంటి ఎంపిక ట్రయల్స్ క్రీడాకారినుల్లోని ప్రతిభను వెలికితీయడంతో పాటు ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ఈ ఎంపిక ట్రయల్స్ లో వివిధ కళాశాలలకు చెందిన మహిళ బ్యాడ్మింటన్ కి క్రీడాకారిణులతో పాటు ఫిజికల్ డైరెక్టర్లు, కోచులు పాల్గొన్నారు.