18వ ఎడిషన్ ఇంటర్నేషనల్ రౌండ్ టేబుల్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ సదస్సు
- పాల్గొన్న ట్రస్మా గౌరవాధ్యక్షులు శేఖర్ రావు
కరీంనగర్,(విజయక్రాంతి): 18వ ఎడిషన్ అంతర్జాతీయ విద్యా నాయకత్వ రౌండ్ టేబుల్ సమావేశం శనివారం లక్నోలో ఘనంగా జరిగింది. "ఏఐ యుగం కోసం పాఠశాలలను పునఃరూపకల్పన చేయడం" అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, పాఠశాల లీడర్లు చర్చించారు. ఈ సదస్సులో జరిగిన ప్యానెల్ డిస్కషన్ లో ట్రస్మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఏఐ యుగంలో లీడర్ ఇన్స్పెక్టర్ నుండి ఇన్స్పైరర్ గా మారాలని, కాగితాల పని వల్ల మిగిలిన సమయాన్ని తరగతి గదిలో పిల్లల మధ్య తిరగడానికి ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు. కాగితంపై బోధనకు సాక్ష్యం అడగడం ఆపి, తరగతి గదిలో అభ్యాసానికి సాక్ష్యం అడగాలని సదస్సు తీర్మానించింది.