తల్లి, రెండేళ్ల చిన్నారి అదృశ్యం..
బాన్సువాడ, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) బాన్సువాడ మండలం తాడ్కల్ గ్రామంలోని రాజారాందుబ్బకు చెందిన టేకు సుజాత (25), తన రెండేళ్ల కుమార్తె టేకు మాధవితో కలిసి అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై సుజాత తల్లి గడ్డం ముత్తవ్వ ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీసులు వివరాలు వెల్లడించారు.
ఈ నెల 24వ తేదీ ఉదయం సుమారు 8 గంటలకు తలనొప్పిగా ఉందని, ఆసుపత్రికి వెళ్లి వస్తానని చెప్పి సుజాత తన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. సుజాత ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.అదృశ్యమైన టేకు సుజాత (25): ఎత్తు సుమారు ఐదు అడుగులు, కోల ముఖం, తెలుపు రంగు ఛాయ. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఆకుపచ్చ రంగు టాప్, తెలుపు రంగు చున్నీ, పాయింట్ ధరించి ఉంది.
టేకు మాధవి (2): గుండ్రని ముఖం, చామనఛాయ. అదృశ్యమైన సమయంలో గులాబీ రంగు దుస్తులు ధరించి ఉంది. వీరిని ఎక్కడైనా చూసినవారు లేదా వారి ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిసినవారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా బాన్సువాడ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. చిన్నారి సహా తల్లి ఆచూకీ గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.