పోలీసుల ఓపెన్ హౌజ్ కార్యక్రమం...
చెన్నూర్ (,విజయక్రాంతి):మంచిర్యాల జిల్లా చెన్నూర్ పోలీసులు ఓపెన్ హౌజ్ కార్యక్రమం(Police Open House Program) నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్ పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, కేసుల దర్యాప్తు ప్రక్రియతో పాటు కీలక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థులు పోలీసు వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడుతు నివాళులర్పించారు.