ఖానాపూర్ ఎమ్మెల్యేలు కలిసిన ట్రస్మా నేతలు
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) సభ్యులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) ముధోల్ ఎమ్మెల్యే రామారావు రామారావు పటేల్ ను కలిశారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని ఆర్కే కన్వెన్షన్ హాల్లో గురుశ్రేష్ఠ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, రాష్ట్ర ఈసీ సభ్యులు పడాల ప్రభాకర్, షబ్బీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.