విద్యార్థులకు పోలీస్ శాఖపై అవగాహన

27-10-2026 | 06:22pm

మల్లాపూర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో(Mallapur Police Station) మంగళవారం మోడల్ స్కూల్ విద్యార్థులకు(Model School students) ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీస్ శాఖ విధులు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం చేపట్టే చర్యల గురించి వివరించారు.పోలీసు విధుల్లో ఉపయోగించే వివిధ పరికరాలు, సామగ్రిని విద్యార్థులకు పరిచయం చేసి వాటి పనితీరుపై అవగాహన కల్పించారు.

చట్టాల పట్ల గౌరవం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. దేశ రక్షణతో పాటు ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖపై అవగాహన పెంపొందించడంతో పాటు పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ. అనిల్‌తో పాటు పోలీస్ సిబ్బంది, మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు