తిప్పాపూర్‌లో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

01-11-2026 | 11:51pm

బిక్కనూర్, నవంబర్ 1 (విజయక్రాంతి): భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో రాష్ట్ర ఎమ్మార్పీఎస్(MRPS) ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా నార్గల రాజు, ఉపాధ్యక్షుడిగా ఇల్లిందుల గణేష్, అధికార ప్రతినిధిగా జీవన్, ప్రధాన కార్యదర్శిగా రామును నియమించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితులపై ఎక్కడ వివక్ష జరిగినా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. దళితుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు