పార్టీ బలోపేతానికి కృషి చేయాలి..
సదశివనగర్, అక్టోబర్ 08(విజయక్రాంతి):గ్రామాల్లో పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలనీ బీజేపీ మండల అధ్యక్షుడు కుంట రాంరెడ్డి(BJP Mandal President Kunta Ramreddy) అన్నారు. మండల కేంద్రంలోని గురువారం బిజెపి కార్యాలయంలో అధ్యక్షులు కుంట రాంరెడ్డి గారి ఆధ్వర్యంలో బిజెపి మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ చక్రధర్ గౌడ్, రమేష్ రెడ్డి ఉపాధ్యక్షులు ప్రవీణ్, జైపాల్ రెడ్డి, గంగాధర్ జిల్లా నాయకులు కొప్పుల గంగారెడ్డి, పోలబోయిన సాయిలు మరియు ఆశన్న తదితరులు పాల్గొన్నారు.