ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి(Kottapalli)లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల(Alford's E-Techno School) విద్యార్థులు ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ జోనల్ స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్(SGF State-level Football Championship) పోటీలలో ఎం ఆరాద్యా రెడ్డి, డి సంషిత, ఈ గ్రేసి, పి అనుమ్, ముక్రమ్, బి కరన్దీప్, టి నిశ్చల్, కే ఋషికేష్ లు ప్రతిభ కనబరిచి ఈ నెల 12, 13, 14న హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్కూల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలోనూ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.