రాయపూడి మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం

08-10-2026 | 09:51pm

కోదాడ అక్టోబర్ 8(విజయ క్రాంతి): పితృ మహాలయ పక్షాలను పురస్కరించుకుని రాయపూడి నాగేశ్వరరావు, ఉదయలక్ష్మి, హిమబిందుల జ్ఞాపకార్థం రాయపూడి వెంకటనారాయణ కుటుంబ సభ్యులు, రాయపూడి మిత్రమండలి(Rayapudi Friends' Association) ఆధ్వర్యంలో గురువారం కోదాడ బస్టాండ్ ఆవరణలో సుమారు 400 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా రాయపూడి వెంకటనారాయణ మాట్లాడుతూ “మన పితృదేవతలను స్మరించుకుంటూ, వారు మనకు అందించిన జీవితానికి కృతజ్ఞతగా వారి రుణం తీర్చుకునే ఒక పవిత్రమైన అవకాశంగా ఈ రోజును భావించాం. పితృదేవతల ఆశీస్సులు మన కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాం.” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాయపూడి వెంకటనారాయణ కుటుంబ సభ్యులు, రాయపూడి మిత్రమండలి సభ్యులు, కోదాడ ఆర్యవైశ్య పెద్దలు పాల్గొని పితృదేవతలను స్మరించుకుంటూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

మరిన్ని వార్తలు