కరువు మండలాల జాబితాపై బండి సంజయ్ ఆగ్రహం

28-10-2026 | 11:16am

కరీంనగర్, అక్టోబర్28(విజయక్రాంతి): కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక లోటు వర్షపాతం ఉన్న చాలా మండలాలు జాబితాలో లేవు. మొక్కుబడిగా మండలాల జాబితాను ప్రకటించారని మండిపడ్డారు. కరువు మండలాల ప్రకటనపై ఇంత వివక్ష ఎందుకు? అశాస్త్రియంగా వీటి ఎంపిక చేసినట్లు జాబితా చూస్తేనే అర్థమవుతుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి(Karimnagar Parliamentary Constituency) తీవ్ర అన్యాయం జరిగిందని 35శాతం లోటు వర్షపాతం ఉన్న మండలాలు కూడా కరువు జాబితాలో(List of drought-affected areas) లేకపోవడం బాధాకరమన్నారు.

హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి , హుజూరాబాద్ నియోజకవర్గాల్లో(Choppadandi, Huzurabad constituencies) అనేక మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా కన్పించడం లేదా అని ప్రశ్నించారు. పొలాలన్నీ బీళ్లుగా మారి తాగునీటికి ఇబ్బంది పడుతుంటే పట్టించుకోరా అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో(Farmer) మాట్లాడితే పరిస్థితి తెలుస్తుందన్నారు. నిధులు ఖర్చు(Expenditure of funds) చేయాల్సి వస్తుందని కరీంనగర్ పార్లమెంట్ ను విస్మరించారా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు