బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ

02-10-2026 | 05:12pm

హుజురాబాద్, అక్టోబర్ 02 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బీజేపీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో స్వచ్ఛ సేవ(Swachh Seva) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను శుభ్రం చేసి చెత్తను తొలగించారు. 

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింస, స్వచ్ఛత మార్గాలు నేటికీ సమాజానికి ఆదర్శమన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని, “జై జవాన్–జై కిసాన్” నినాదంతో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపారని తెలిపారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు: బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గంగిశెట్టి ప్రభాకర్, సెంట్రల్ ఫిలిం బోర్డు మెంబర్ సబ్బని రమేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, 10వ వార్డు కౌన్సిలర్ కొలుగూరి సుమలత, పడారి సుమన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు తిప్పబత్తిని రాజు, గంట సంపత్, ఉపాధ్యక్షులు ఓడ్నాల విజయ్, ఇల్లందుల ప్రణీత్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కుతాడి కుమారస్వామి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొలిపాక వెంకటేష్, యువమోర్చా అధ్యక్షుడు మోటపోతుల రాకేష్, కార్యదర్శులు బొడిగ రాధ, కొలుగూరి అనిల్, కోశాధికారి క్యాస వెంకటేష్, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, కొలిపాక శ్రీనివాస్, పోతుల సంజీవ్,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు