స్మశాన వాటిక అభివృద్ధికి ప్రాధాన్యత

30-10-2026 | 03:12pm

దమ్మక్కపేటలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ చేసిన చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని

హుజురాబాద్, అక్టోబర్ 30: (విజయ క్రాంతి): హుజురాబాద్ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు(Creation of basic infrastructure) ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు(Development works) చేపడుతున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు అన్నారు. పట్టణంలోని 9వ వార్డు దమ్మక్కపేటలో స్మశాన వాటికకు నూతనంగా కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు గురువారం ఆమె కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. స్మశాన వాటికలు కూడా పట్టణ మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైనవని, వాటి అభివృద్ధి, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. దమ్మక్కపేట స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ నిర్మించడం ద్వారా పరిసరాల భద్రతతో పాటు పరిశుభ్రత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. పట్టణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సమ్మయ్య, సునీత బాబు, తాళ్లపెల్లి రమేష్, వెన్నెల నవీన్, మొగిలి, మహమ్మద్ ఖలీద్, పుణ్య బాబు, భాస్కర్, స్వరూప తిరుపతి, వార్డు ప్రజలు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు