శ్రీనగర్ కాలనీలో ఘనంగా గణపతి నిమజ్జన వేడుకలు

25-09-2026 | 11:27pm

అంగరంగ వైభవంగా గణపతినాథుని ఊరేగింపు..

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న కాలనీ వాసులు

రాజన్న సిరిసిల్ల 25 సెప్టెంబర్ (విజయక్రాంతి): శ్రీనగర్ కాలనీ వాసులు గణపతి నిమజ్జన వేడుకలను(Ganapati immersion ceremony) ఘనంగా నిర్వహించారు. గణపతినాథుని ప్రత్యేకంగా అలంకరించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం కాలనీలో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపులో మహిళలు, యువత, కాలనీ వాసులు(Women, youth, and colony residents) పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి నామస్మరణతో సందడి చేశారు. భక్తుల కోలాహలం మధ్య గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు