నిరసన తెలియజేసే అధికారం లేదా
కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్ వేర్ నిపుణులు ఈవీఎంలను మేనేజ్ చేయవచ్చని చెబుతున్నారని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(Prajamitra Progressive Democratic Front) రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ గురువారం ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలిసో, తెలియకనో ఆనాడు భారత దేశంలో ఈవీఎంల(EVMs)ను తీసుకురావడం జరిగిందన్నారు. ఇప్పుడు వాటి దుష్ప్రభావాలను అనుభవించాల్సి వస్తుంది.
ఈవీఎంలను కొన్ని రాష్ట్రాలలో కొన్ని నియోజకవర్గాలలో మేనేజ్ చేస్తే ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతాయి అనగా నెంబర్ కౌంట్ తారుమారు అవుతుందన్నారు. సర్ ప్రక్రియ కరెక్ట్ గా లేదని 300 మంది ప్రతిపక్ష ఎంపీలు (రాజ్యసభ, లోక్ సభ) నిరసన తెలిపే పరిస్థితి కూడా లేదు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు అంటే ప్రజాస్వామ్యం బంది అయిపోయిందని అర్థమవుతుందన్నారు. సర్ ప్రక్రియ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువకులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.
భవిష్యత్తులో ఈ నిరసన కేంద్ర ప్రభుత్వంపై పెద్ద తిరుగుబాటుగా మారనుందన్నారు. కరీంనగర్ ఎంపీ కేంద్రంలో మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పాలిత నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను రాజీనామా చేయాలని వ్యంగ్యంగా అంటున్నారు అలాంటప్పుడు బిజెపి పాలిత నాలుగు రాష్ట్రాలు కూడా రాజీనామా చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు పోతే ప్రజలు ఇచ్చే తీర్పు అప్పుడు అర్థమవుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో కొంపెల్లి రవీందర్, గజ్జల ఆనందరావు, గాజం నరేందర్, రాజ్ కుమార్ లు పాల్గొన్నారు