వెలిచాల గ్రామంలో రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన
కొత్తపల్లి, నవంబర్ 06 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(కరీంనగర్ జిల్లా) రామడుగు మండలం వెలిచాల గ్రామంలో శుక్రవారం రోజున టీఆర్వికె కరీంనగర్ మరియు బిజెఆర్ వ్యవసాయ కళాశాల(BJR Agricultural College), సిరిసిల్లకు చెందిన ఆర్ఎడబ్ల్యూఇపి విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన(Agricultural Exhibition) నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెఆర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఉపేందర్ ఆర్ఎడబ్ల్యూఇపి విద్యార్థుల గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమాల కార్యకలాపాలు మరియు విశ్వవిద్యాలయం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల గురించి వివరించారు.
తదుపరి టీఆర్వికె, కరీంనగర్ శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డా. పి. మధుకర్ రావు టీఆర్వికె ద్వారా చేపడుతున్న రైతు సంక్షేమ మరియు విస్తరణ కార్యక్రమాలను వివరిస్తూ, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన పంటల మార్పిడి విధానాలు మరియు ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికల గురించి వివరించారు. అదే విధంగా జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రబీ పంటల ప్రణాళిక మరియు ప్రత్యామ్నాయ పంటల సాగు పద్ధతులను తెలిపారు.
వివిధ వ్యవసాయ అంశాలపై నిపుణులు రైతులకు సాంకేతిక సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి. నర్సింగరావు, శ్రాస్తవేత్తలు డా. ఇ. రజినీకాంత్,డా. జి. ఉషారాణి,అరుణ్ బాబు,రాజేంద్ర ప్రసాద్,సతీష్,అనిల్ రెడ్డి, ఏడీఏ ప్రియదర్శిని, మండల వ్యవసాయాధికారి ప్రభావతి,వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.