జోనల్ క్రికెట్కు MMCC క్రీడాకారుల ఎంపిక
బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(Mancherial District-Level School Games Federation) ( ఎస్.జి. ఎఫ్) అండర్ 14 క్రికెట్ పోటీలలో(Cricket match) అద్భుతమైన ప్రతిభ కనబరిచిన బెల్లంపల్లి ఎంఎంసీసీ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు ఎంపికైనట్లు అకాడమీ నిర్వాహకులు అల్లం వెంకటేశ్వర్లు,కోచ్ గౌతం తెలిపారు. మంచిర్యాల జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ గ్రౌండ్స్ లో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో తమ విద్యార్థులు రెడ్డి రిత్విక్, సానా మోక్షిత్జి, జిల్లపల్లి విజయ్, ఎం డి మెహరాన్ ఆదిలాబాద్ లో జరిగే జోనల్ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. జోనల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను పలువురు అభినందించారు.