అయోధ్య, కాశీ ఉచిత యాత్ర ప్రారంభం

25-10-2026 | 04:25pm

ముకరంపుర, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) నగరంలోని వైశ్య భవన్ వద్ద గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైశ్య నిరుపేద భక్తుల కోసం ఏర్పాటు చేసిన అయోధ్య, కాశీ ఉచిత యాత్ర కార్యక్రమం ఆదివారం  ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంప శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్ర మూడో సంవత్సరానికి చేరుకోవడాన్ని అభినందించారు. వైశ్య నిరుపేద భక్తుల కోసం గంప శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో ఈ యాత్రను ఏర్పాటు చేయడం సుమారు 8 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా రెండు బస్సులను ఏర్పాటు చేసి, దాదాపు 45 కుటుంబాల సభ్యులను అయోధ్య, కాశీ క్షేత్రాలకు ఉచితంగా తీసుకు వెళ్లడం గొప్ప విషయం అన్నారు. యాత్రకు బయలుదేరిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి, ఈ యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారని అన్నారు. అయోధ్య రాముడు మరియు కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో భక్తుల యాత్ర సుఖంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్నం ప్రకాష్, గాజ శివరాం, వైశ్య సంఘం ప్రతినిధులు, బిజెపి నాయకులు మరియు  యాత్రకు బయలుదేరిన భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు