5 September, 2026 | 1:26 PM

కేటీఆర్‌కు ఘనస్వాగతం

05-09-2026 | 12:41pm

కరీంనగర్ సిటీ, సెప్టెంబర్05(విజయక్రాంతి): కరీంనగర్ లో కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) కు ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగా పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట(BRS Porubata) కార్యక్రమంలో భాగంగా శనివారం విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్, యువత కు జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు, యువతతో  భారీ సదస్సు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Party Working President) కల్వకుంట్ల తారక రామారావు   హాజరయ్యేందుకు వచ్చారు. KTR అడుగడుగునా స్వాగతం పలికారు. రేకుర్తి వద్ద డివిజన్ కార్పొరేటర్ సూడగొని మాధవి కృష్ణ గౌడ్ తో పాటు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. 22/ఏ నిషేధిత జాబితానుం డి రేకుర్తి భూములను తొలగించేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కార్పొరేటర్ కేటీఆర్ ను కోరారు.

మరిన్ని వార్తలు