5 September, 2026 | 1:48 PM

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం -ఉపాధ్యాయులకు సన్మానం

05-09-2026 | 12:38pm

కోహెడ, సెప్టెంబర్ 5, విజయక్రాంతి: ఉపాధ్యాయ దినోత్సవాన్ని(Teachers' Day) పురస్కరించుకొని.. తీగలకుంటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు(Government Primary School) చెందిన ఉపాధ్యాయులను సర్పంచ్ మ్యాకల స్వర్ణలత శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని ప్రతి యేటా ఉపాధ్యాయ పండుగగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు పాఠశాల లో పిల్లలకు విద్యతో విలువలను, విజ్ఞానాన్ని పెంపొందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు