5 September, 2026 | 1:29 PM

కుప్టి వంతెనపై ప్రమాద ఘంటికలు.. అధికారులు స్పందించరా?

05-09-2026 | 12:45pm

నేరడిగొండ, సెప్టెంబర్ 05, (విజయక్రాంతి) : నేరడిగొండ మండలంలోని కుప్టి గ్రామ(Kupti village) సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదం(Road accident)లో ఇద్దరికి తీవ్రగాయలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానిక వంతెనపై ప్రమాదకర గుంత ఏర్పడటంతో నలుగువరసల్లో కొనసాగాల్సిన వాహనాల రాకపోకలు ఓ వైపు (రెండు) వరసల్లో మాత్రమే జరుగుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు వారు పేర్కొన్నారు. నాయకులు, అధికారులు పట్టించుకొని గుంతను పూడ్చి సమస్యను పరిష్కరించి, రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు