వైద్య ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు

17-10-2026 | 06:18pm

నిర్మల్ ,అక్టోబర్ 17 ( విజయక్రాంతి) : నేషనల్ హెల్త్ మిషన్లో(National Health Mission) విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) సంపూర్ణ మద్దతిస్తుందని జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(Syed Haider) తెలిపారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం(Nirmal RDO Office) ఎదుట నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు(National Health Mission Employees) చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు పలికారు. ఈల తరబడి ప్రజల ఆరోగ్యానికి సేవలు చేస్తున్న ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఉద్యోగులు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు