రైతులకు ఉచిత విద్యుత్ అందించాలి

08-10-2026 | 08:16pm

కరీంనగర్ సిటీ అక్టోబర్08 (విజయక్రాంతి ): ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు చొప్పదండి నియోజకవర్గం, రామడుగు మండలంలోని దత్తూజిపేట గ్రామంలో సరైన విద్యుత్ సరఫరా లేక సాగునీరు అందక ఎండిపోయిన వరి పొలాలను తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్  మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన వరి పంటకు సరైన సమయంలో నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. 

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, విద్యుత్ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి, వారికి పంట నష్టపరిహారం అందించాలని  రైతుల సమస్యలను నిర్లక్ష్యం చెయ్యకుండా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని లేనిఎడల

తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట చొప్పదండి నియోజకవర్గం నాయకులు మ్యాకల తిరుపతి, మ్యాక వినోద్, శ్రీరాముల రమేష్, చంటి శ్రీనివాస్, పుల్ల మల్లేశం, కరీంనగర్ నగర పార్టీ అధ్యక్షురాలు రంగరవేణి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు