కొత్తపల్లి–జగిత్యాల హైవేపై సీసీ కెమెరాల ఏర్పాటు
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి–జగిత్యాల హైవే(Kothapalli Jagityala highway)పై ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థ(CCTV camera system)ను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి, ఏసీపీ–రూరల్ విజయ్ కుమార్ &. కొత్తపల్లి సీఐ బి.కోటేశ్వర్ అతిథులుగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రధాన రహదారులు, హైవేలపై ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు 24×7 నిఘా, వాహనాల కదలికల పర్యవేక్షణ, ప్రమాదాల గుర్తింపు, నేరాలకు సంబంధించిన ఆధారాల సేకరణ వంటి అంశాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు సంఘటనకు సంబంధించిన దృశ్యాలను పరిశీలించడం ద్వారా దర్యాప్తును వేగవంతం చేయడానికి వీలుంటుందని పేర్కొన్నారు. కొత్తపల్లి–జగిత్యాల హైవేపై ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం, రోడ్డు ప్రమాదాలపై తక్షణ స్పందనకు సహకరించడం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలను గుర్తించడం వంటి చర్యలకు మరింత అవకాశం కలుగుతుందని తెలిపారు.ఆధునిక సీసీ కెమెరా వ్యవస్థలలో హై-రిజల్యూషన్ వీడియో రికార్డింగ్, రాత్రి వేళల్లో నిఘా, వాహనాల నంబర్ ప్లేట్‌లను గుర్తించే సాంకేతికత, నిరంతర పర్యవేక్షణ వంటి సదుపాయాలు ఉండటం వల్ల హైవేలపై భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని వివరించారు.
ప్రజా సేవలో నిమగ్నమైన సమాజ హితమైన కార్యక్రమాలు చేస్తున్ నరేందర్ రెడ్డి వారు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టి సమాజానికి చేయూతని ఇవ్వాలని వారు కోరారు. తదుపరి డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా భద్రతకు తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రహదారులపై ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా లభించే భద్రతను సద్వినియోగం చేసుకుంటూ, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగించడం, వేగ నియంత్రణ పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం ద్వారా రహదారి భద్రతకు సహకరించాలని పోలీసు అధికారులు సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సూచన మేరకు వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.