బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడితో రజక సంఘం భేటీ
రజక సంఘం కార్యవర్గం
కొత్తపల్లి, అక్టోబర్ 16(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) రజక సంఘం అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు బిజెపి పార్టీ ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధ మల్ల ఆనంద్ గౌడ్(Gandhamalla Anand Goud) ను శుక్రవారం రోజున కలవడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్(Rachakonda Naresh) రజకుల సమస్యలను తెలియజేశారు.
కరీంనగర్ జిల్లాలో సుమారుగా మూడు లక్షల జనాభా కలిగిన రజక జాతి సాంఘికంగా ఆర్థికంగా మరియు సామాజిక వివక్షకు గురి అవుతున్నారని, కరీంనగర్ జిల్లాలో రజక మహిళలు ఇంట్లో బట్టలు ఉతుకుతూ మరియు పాత్రలు తోముతు కులవృత్తిని కొనసాగిస్తున్నారని , అలాగే దళితులు మాపై దౌర్జన్యపూరితంగా కేసులు పెడుతూ మామూలను మా జీవనశతి గతిని దుర్బలంగా చేస్తున్నారని తెలుపుతూ, రజక వృత్తిలో ఇతర కులస్తులైన పెత్తందారులు చొరబడి మమ్ములను వృత్తి కూలీలుగా మారుస్తూ మా కులస్తులనే మాపై దాడి చేసే విధంగా ప్రోత్సహిస్తూ కులవృత్తిని నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు.
వారి డిమాండ్లు తెలుపుతూ రజకులను తెలంగాణలో ఎస్సీ జాబితాలో చేర్చాలని , రజక వృత్తిని తెలంగాణలో పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని,తెలంగాణ ప్రభుత్వంలోని గురుకుల పాఠశాలలో హాస్టల్లు, హాస్పిటల్, ఇతర దోబి కాంటాక్ట్ లో రజకులకే కేటాయించాలని , తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లాండ్రీలకు ఉచిత విద్యుత్తు బకాయాలను వెంటనే చెల్లించే విధంగా మీ తోడ్పాటు అందివ్వాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచకొండ కొమురయ్య, జిల్లా నాయకులు పంతంగి రవి జంగల్పల్లి శంకర్, సోషల్ మీడియా కన్వీనర్ గంగిపల్లి విష్ణు రేకుర్తి రజక సంఘం అధ్యక్షులు గంగిపల్లి నారాయణ కొత్తపల్లి రజక సంఘం అధ్యక్షులు జంగలపెళ్లి కొమరయ్య, గంగాధర లక్ష్మయ్య, రాచకొండ కిట్టు మహిళా నాయకురాలు మూసపూల శైలజ, ఇలుగునూరి లక్ష్మి రెడ్డి రాజుల పద్మ, రాచకొండ శ్రీనివాస్, పొన్నాల తిరుపతి, పొన్నాల సంపత్, పొన్నాల రాము, పొన్నాల శంకర్, మునిగంటి లింగయ్య మరియు ఎడవల్లి రమేష్ పాల్గొన్నారు.