బైక్ ఢీకొని వ్యక్తి మృతి
కరీంనగర్ క్రైం, నవంబర్ 26(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ వద్ద రోడ్డు దాటుతున్న విద్యుత్ శాఖ ఔట్సోర్సింగ్(Electricity Department Outsourcing) ఉద్యోగి బైక్ ఢీకొని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామం కృష్ణానగర్‌కు చెందిన ర్యాకం శంకర్ (46) విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
గురువారం బొమ్మకల్ గ్రామంలో విధులు ముగించుకొని గ్లామర్ మోటార్ సైకిల్‌పై కృష్ణానగర్‌కు తిరిగి వెళ్తుండగా, లారీ అసోసియేషన్ సమీపంలోని రహదారిపై రోడ్డు దాటుతున్న సమయంలో గోదావరిఖని వైపు నుంచి పల్సర్ మోటార్ సైకిల్‌పై అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన తాజొద్దీన్ అనే వ్యక్తి శంకర్‌ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో శంకర్ రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర రక్తగాయమైంది. వెంటనే అక్కడున్న స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, అతడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి శంకర్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతుడి భార్య ర్యాకం శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.