ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
నాగిరెడ్డిపేట్,నవంబర్ 26 (విజయ క్రాంతి):మండలంలోని బొల్లారం గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ బద్దిగారి ప్రభుగౌడ్ తెలిపారు.ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Life Insurance Scheme) ప్రారంభించిన మొదటి రోజే 119 మందికి జీవిత బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని సర్పంచ్ బద్దిగారి ప్రభుగౌడ్ తెలిపారు.మిగిలిన అర్హులైన కుటుంబాలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవిత బీమా సౌకర్యం పొందాలని సర్పంచ్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రజల కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, కావున గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్దిగారి ప్రభు గౌడ్,గ్రామ కార్యదర్శి సంతోష్ కుమార్,వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.